Abn logo
Jun 11 2021 @ 02:59AM

మోదీ అగ్ర నాయకుడు: రౌత్‌

దేశంలోనూ, బీజేపీలోనూ ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర నాయకుడని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. గత ఏడేళ్లలో మోదీ వల్లే బీజేపీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మోదీని కలిసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గురువారం జల్గావ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని యావద్దేశానికీ ప్రధాని అని, అందువల్ల ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని, అలా చేస్తే అధికార యంత్రాంగంపై ఒత్తిడి పడుతుందని పేర్కొన్నారు. పులితో (శివసేన పార్టీ గుర్తు) బీజేపీ స్నేహం చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పులితో ఎవరూ స్నేహం చేయలేరని, ఎవరితో స్నేహం చేయాలో నిర్ణయించేది పులియే అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement