Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 17:33PM

మోదీ, కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయం: రేవంత్‌

హైదరాబాద్‌: వరి కొనకపోతే ప్రదాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్యబట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ధాన్యం కొనకుండా దళారీగా మారారని, రైతులపై ఆయన కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండు, అరగుండు మనకు పంగనామాలు పెడతారని తెలిపారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ వేరు కాదు..ఒకరు సారా మరొకరు సోడా అని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తోడుదొంగలేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.


Advertisement
Advertisement