మోదీతో భేటీ అయిన షా, రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-12-05T17:15:26+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. రైతులు, ప్రభుత్వం మధ్య శనివారం ఐదో రౌండ్

మోదీతో భేటీ అయిన షా, రాజ్‌నాథ్

న్యూఢిల్లీ :  ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. రైతులు, ప్రభుత్వం మధ్య శనివారం ఐదో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, తోమర్ భేటీ అయ్యారు. ఈ నెల 8 న భారత్ బంద్, ఐదో రౌండ్ చర్చల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ రైతులతో చర్చించిన అంశాలు, రైతులు ప్రస్తావించిన డిమాండ్లను మంత్రులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మరో దఫా చర్చలు జరపనుంది. వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ చెబుతున్నదాని ప్రకారం... ఈ చర్చల్లో ఏదో ఒకటి తేలిపోవచ్చు. అటు ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ సంఘమైన భారతీయ కిసాన్‌ సంఘ్‌ కూడా రైతుల డిమాండ్లకు మద్దతు పలుకింది. కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగించాలని, ప్రభుత్వ, ప్రైవేటు మండీల్లో కూడా ఎంఎస్పీ రేటే అమలుకావాలని, ఇందుకు చట్టం చేయాలని, ఎంఎస్పీ కంటే చౌక ధరకు కొనడం నేరమని చట్టంలో చేర్చాలని బీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి బదరీనారాయణ చౌధురి మీడియాతో అన్నారు.

Updated Date - 2020-12-05T17:15:26+05:30 IST