Abn logo
Sep 27 2021 @ 23:15PM

మోదీ నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలి

ప్రొద్దుటూరులో బంద్‌ సందర్భంగా ర్యాలీ చేస్తున్న టీడీపీ, టీఎన్‌టీయూసీ నాయకులు

అప్రజాస్వామికంగా తెచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దుచేయండి భారత్‌ బంద్‌లో కార్మిక, మహిళా, ప్రజాసంఘాలు

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 27:దేశ సంపదను కార్పొరేట్‌ బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టే ప్రధాని మోదీ నిరంకుశ విధానాలను సమ ష్టిగా తిప్పికొట్టాలని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.వరలక్ష్మీ పిలుపునిచ్చారు. సోమవారం సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌కు మద్దతుగా ప్రొద్దుటూరులో ప్రగతి శీల కార్మిక సంఘం, రాయలసీమ మహిళాశకి,్త చైతన్య ఆటో యూనియన్‌, రాయలసీమ పరిరక్షణ సమితి, చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్ట ణంలో  బంద్‌ నిర్వహించారు. ఈ సంద్బంగా బాలాజి క్లాత్‌ మార్కెట్‌లో వ్యాపారులను ఉద్దేశించి వరలక్ష్మీ మాట్లాడుతూ  వ్యవసాయ, పారిశ్రామిక రంగాలన్నింటిని కార్పొరేట్‌ శక్తులైన అంబానీ, ఆదానీ చేతుల్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష, ప్రజాస్వామిక శక్తులన్నీ  ఆందోళన బాటపడ్డాయన్నారు.  నిత్యావసరాలతో పాటు పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలను అడ్డూ అదుపులేకుండా పెంచుతూ సామాన్యు డు జీవించలేని పరిస్థితులు మోదీ ప్రభుత్వం కల్పించిందన్నారు. కార్యక్రమంలో పీకేఎస్‌ కన్వీనర్‌ నాగేంద్ర, మహిళాశక్తి కన్వీనర్‌ వడ్ల లక్ష్మీదేవి, ఆర్‌పీఎస్‌ ప్రతాప్‌రెడ్డి,  చైతన్య ఆటోయూనియన్‌ నేత రసూల్‌, సీఎంఎస్‌ కన్వీనర్‌ పద్మ, సృజన, సామాజిక వేదిక కన్వీనర్‌ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. 

టీడీపీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో..

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎ్‌సముక్తియార్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌ నేతృత్వంలో కోనేటి కాల్వ వీధి, గాంధీ రోడ్డులలో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక సాగుచట్టలను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు.

బంద్‌ విజయవంతం

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 27: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం చేపటి ్టన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌, తెలుగుదేశం, ఆమ్‌ ఆద్మీపార్టీ, రాయలసీమ కమ్యూనిస్తు పార్టీ, మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ బంద్‌లో పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ బస్సు లు నిలిచిపోయాయి. ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. వామపక్ష పార్టీల నాయకులు. వీధుల్లో తిరుగుతూ దుకాణాలు మూసివేయించారు.  ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణలు మాట్లాడుతూ పది నెలలుగా రైతులుఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ అధికారాన్ని ప్రభు త్వం కోల్పోతోందన్నారు.  కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, సభ్యులు శివారెడి ్డ, నరసింహ, ఏఐటీయూసీ నాయకులు యే సోబు, గోవిందరెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య నేతలు సుజాత, ప్రమీళ, ఏపీజే జిల్లా అధ్యక్షుడు సలీం, కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు నజీర్‌, ఆర్టీసీ డివిజన్‌ కార్యదర్శి షరీఫ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీజాదస్తగీర్‌, చైతన్య ప్రజాసంఘం పద్మ, సీపీ ఎం నాయకులు పక్కీరయ్య, శేఖర్‌, మహిళా సంఘం రాములమ్మ, ముంతాజ్‌, గురమ్మ, ఆటో యూనియన్‌ నాయకులు రెహమాన్‌, యేసు, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు మారుతి, గణేష్‌, ఐఎంఎల్‌ నాయకులు సాల్మన్‌, చంటి పాల్గొన్నారు.

కార్మికుల కడుపుకొట్టే చట్టాలను ఎత్తివేయాలి

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు27: కేంద్ర ప్రభుత్వం కార్మికుల, రైతుల, శ్రమజీవుల కడుపుకొటే ్ట విధి విధానాలను, నల్లచట్టాలను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎండీ నజీర్‌ పేర్కొన్నారు. సోమవారం భారత్‌బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని బంగారు అంగళ్ల వీధి, గాంధీరోడ్డులో వాణిజ్య దుకాణాలను, బ్యాంకులను మూయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం, ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్‌ సంస్థలకు హస్తగతం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. డీజిల్‌, పెట్రోలు, వంట గ్యాస్‌ ధరలను పెంచడం కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. ఆంధ్రా ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట మార్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రజల ఓటు బ్యాంకుతో ప్రజలకు గుణపాఠం చెబుతామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంద్‌ విజయవంతానికి సహకరించిన అన్ని సంఘాల నాయకులకు, రాజకీయ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు యల్లయ్య, శ్రీను, సమీర్‌, జావీద్‌, నాని పాల్గొన్నారు.

నల్లచట్టాలు రద్దయ్యేవరకు పోరు ఆగదు

జమ్మలమడుగు రూరల్‌, సెప్టెంబరు 27: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలు రద్దయ్యేవరకు పోరు ఆగదని వామపక్ష నాయకులు హెచ్చరించారు. సోమవారం భారత్‌ బంద్‌లో భాగంగా జమ్మలమడుగు పట్టణ  ఎంపీడీవో కార్యాలయ ఆవరణం నుంచి పాత బస్టాండులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ , జిల్లా కమిటీ సభ్యులు శివనారాయణ, ప్రసాద్‌, టీడీపీ నాయకులు పొన్నతోట శ్రీను, మల్లికార్జున, తదితరులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడంతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలన్నారు. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను అదుపు చేయాలన్నారు.  కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఆటో కార్మికులు విజయ్‌, సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


 

కొండాపురంలో బంద్‌ ప్రశాంతం 

కొండాపురం, సెప్టెంబరు 27: కొండాపురంలో సోమవారం ప్రజాసంఘాలు చేపట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. స్థానిక బైపా్‌సరోడ్డుపై సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపారసంస్థలను, బ్యాంకులను మూయించి వేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ విదానాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, చిన్నా, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు నాగసుబ్బరాయుడు పాల్గొన్నారు. 

రైతుల నడ్డి విరుస్తున్న కేంద్రం

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 27: మోదీ సర్కారు రైతు వ్యతిరేక నూతన చట్టాలను చేసి వారి నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తోందని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం భారత్‌బంద్‌లో భాగంగా ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలివద్ద అఖిలపక్షం సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో బంద్‌నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.  ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను ఆపకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందన్నారు.  విద్యుత్‌ చట్టం 2020ని రద్దుచేయాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. కార్యక్రమంలో  సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంవీసుబ్బారెడ్డి, నారాయణ, బయన్న, సుంకర నాగేశ్వరరావు, ఎస్‌.సంజీవరెడ్డి, టైలర్‌మాబు, రమేష్‌రెడ్డి, ఇల్లూరు క్రిష్ణారెడ్డి, గొర్రెఓబయ్య, రైతులు పాల్గొన్నారు. 

జమ్మలమడుగులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యం


ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్ద భారత్‌బంద్‌లో పాల్గొన్న అఖిలపక్షం నేతలు