మోదీ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2021-06-24T05:08:21+05:30 IST

నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజల నడ్డి విరిచే పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పులి కృష్ణమూర్తి, సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి ఓబయ్యలు పిలుపునిచ్చారు.

మోదీ పాలనకు చరమగీతం పాడాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న వామపక్షాలు

కలెక్టరేట్‌ వద్ద వామపక్షాల ఆందోళన

కడప(రవీంద్రనగర్‌), జూన్‌ 23: నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజల నడ్డి విరిచే పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పులి కృష్ణమూర్తి, సీపీఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి ఓబయ్యలు పిలుపునిచ్చారు. బుధవారం కడప కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై తీవ్ర భారం మోపుతోందని, ఒక్క నెలలోనే 26 సార్లు పెట్రో, డీజలు ధరలు పెంచిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి పది కిలోల బియ్యం, నిత్యావసర సరుకుల సామగ్రి, ప్రతి కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్‌, రామ్మోహన్‌, గాలిచంద్ర, వెంకటశివ, సీపీఎం నగర కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి, అన్వేష్‌, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:08:21+05:30 IST