మొఘలాయి పరోటా

ABN , First Publish Date - 2020-06-20T18:06:54+05:30 IST

మైదా - రెండు కప్పులు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు ఒక టీస్పూన్‌, క్యాప్సికం - ఒకటి, క్యారెట్‌ - రెండు, పసుపు - పావు టీ స్పూన్‌, కారం

మొఘలాయి పరోటా

కావలసినవి: మైదా - రెండు కప్పులు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - నాలుగు, అల్లంవెల్లుల్లి పేస్టు  ఒక టీస్పూన్‌, క్యాప్సికం - ఒకటి, క్యారెట్‌ - రెండు, పసుపు - పావు టీ స్పూన్‌,  కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - పావు టీస్పూన్‌, మామిడికాయపొడి - అర టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, పనీర్‌ - 100 గ్రాములు. 


తయారీ: ఒకబౌల్‌లో మైదా తీసుకుని, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. కాస్త నూనె కోటింగ్‌లా పూసి మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. తరువాత క్యాప్సికం, క్యారెట్‌లను సన్నగా తరిగి అందులో వేయాలి. మరికాసేపు వేగించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మామిడికాయపొడి, గరం మసాలా తగినంత ఉప్పు వేసి కలపాలి. కాసేపయ్యాక సన్నగా కట్‌ చేసుకున్న పనీర్‌ వేసి కలపాలి. అంతే.. స్టఫ్‌ రెడీ. ఇప్పుడు మెత్తగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ చపాతీ కన్నా వెడల్పుగా చేయాలి. మధ్యలో పనీర్‌ స్టఫ్‌ పెట్టి నాలుగు వైపులా చపాతీని దగ్గరకు మూసి చేత్తో నెమ్మదిగా ఒత్తాలి. వీటిని పాన్‌పై నూనె వేసుకుంటూ చిన్నమంటపై రెండు వైపులా కాల్చాలి. క్రిస్ప్‌గా, గోధుమ రంగులోకి మారే వరకు కాల్చితే నోరూరించే పనీర్‌ స్టఫ్డ్‌ మొఘలాయి పరోటా రెడీ.

Updated Date - 2020-06-20T18:06:54+05:30 IST