మొగులయ్య కృషి అమోఘం

ABN , First Publish Date - 2022-01-27T05:43:59+05:30 IST

అంతరించిపోతున్న జానపద కళను కాపాడేందుకు మొగులయ్య చేస్తున్న కృషి అమోఘమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

మొగులయ్య కృషి అమోఘం
లింగాలలో మొగులయ్యను సన్మానిస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల

- ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు  

- పద్మశ్రీ అవార్డు గ్రహీతకు సన్మానం  

లింగాల/అచ్చంపేట, జనవరి 26: అంతరించిపోతున్న జానపద కళను కాపాడేందుకు మొగులయ్య చేస్తున్న కృషి అమోఘమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. మండల పరిధిలోని అవుసలికుంటకు చెందిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో బుధవారం లింగాలలో సన్మానించారు. అవార్డు గ్రహీత మొగులయ్య మా ట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కళకు గుర్తింపునిచ్చాడని అన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో  చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్‌ కోనేటి తిరుపత య్య, విండో వైస్‌ చైర్మన్‌ వెంకటగిరి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రవిశంకర్‌, నాయకులు మాకం తిరుపతయ్య, కేటీ తిరుపతయ్య, రానోజీ, శంకర్‌నాయక్‌, ఎల్లేష్‌, నాగేశ్వర్‌, అల్లె శ్రీనివాసులు, ఆయా గ్రామాల సర్పం చులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే  నాగర్‌కర్నూల్‌ ఎంపీ  రాములు,  జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌   సన్మానం చేశారు. ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు తెచ్చిన మొగులయ్యను పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు అభినందన లు తెలియజేశారు.   

Updated Date - 2022-01-27T05:43:59+05:30 IST