వలస కార్మికులకు మాస్కులు, ఆహారం పంపిణీ చేసిన షమీ

ABN , First Publish Date - 2020-06-02T22:15:44+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెలకొన్ని ఈ క్లిష్ట పరిస్థితిలో ఎందరో సెలబ్రిటీలు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేశాడు. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ

వలస కార్మికులకు మాస్కులు, ఆహారం పంపిణీ చేసిన షమీ

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నెలకొన్ని ఈ క్లిష్ట పరిస్థితిలో ఎందరో సెలబ్రిటీలు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేశాడు. తాజాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న వలస కార్మికులకు టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీ తన వొంతు సహాయం అందించాడు. ఉత్తర్‌ప్రదేశ్ సాహస్‌పూర్‌లోని తన ఇంటి సమీపంలోని 24వ జాతీయ రహదారిపై వలస కార్మికులకు అతను ఆహారం, మాస్కులు, తదితర వస్తువులు పంపిణి చేశాడు. 


ఈ విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ షమీపై ప్రశంసలు కురిపించింది. ‘‘ఇండియా కరోనాతో పోరాడుతున్న సమయంలో. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 24వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి మహ్మద్ షమీ ఆహారం, మాస్కులు పంపిణి చేశాడు. అంతేకాక.. సాహస్‌పూర్‌లోని తన ఇంటి వద్ద ఆహార పంపిణీ కేంద్రం కూడా ఏర్పాటు చేశాడు’’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. దీనిపై మహ్మద్ షమీ స్పందించాడు. ‘‘ధన్యవాదాలు.. అది నా బాధ్యత’’ అంటూ అతను కామెంట్ చేశాడు.



Updated Date - 2020-06-02T22:15:44+05:30 IST