సిరాజ్ దెబ్బకు నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్‌ విలవిల.. పెవిలియన్‌కు ఇలా..!

ABN , First Publish Date - 2020-10-22T01:44:14+05:30 IST

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు బ్యాట్స్‌మెన్ కీలక మ్యాచ్‌లో...

సిరాజ్ దెబ్బకు నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్‌ విలవిల.. పెవిలియన్‌కు ఇలా..!

అబుదాబి: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు‌కు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్ కీలక మ్యాచ్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెంగళూరు బౌలర్ సిరాజ్ బౌలింగ్‌లో కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్స్ 3 వికెట్లను సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కీపర్ క్యాచ్‌గా డివిలియర్స్‌కు చిక్కి ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన రాహుల్ త్రిపాఠి ఒక్క పరుగు మాత్రమే చేశాడు.


రాహుల్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ రాణా అదే ఓవర్‌లో నాలుగో బంతికే సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నవదీప్ సైనీ బౌలింగ్ చేసిన మూడో ఓవర్ రెండో బంతికే గిల్ కూడా మోరిస్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. తరువాత.. ఓ ఫోర్, సిక్స్‌తో టామ్ బంటన్ మెరిసినా ఔట్ కావటానికి ఎక్కువ సేపు పట్టలేదు. సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో ఓవర్ మూడో బంతికి డివిలియర్స్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి బంటన్ కూడా వెనుదిరిగాడు. ప్రస్తుతం దినేష్ కార్తీక్, మోర్గాన్ క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. అద్భుతమైన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో రాణించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ భారత టెస్ట్ జట్టులో ఐదో పేసర్ స్థానం కోసం పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-10-22T01:44:14+05:30 IST