విద్యారంగ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-06-19T05:52:15+05:30 IST

జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ అన్నారు.

విద్యారంగ అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌

- ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఈఓ 

- పలు ఉద్యోగ  సంఘాల నాయకుల శుభాకాంక్షలు 

గద్వాల టౌన్‌/గద్వాల క్రైం/అలంపూర్‌, జూన్‌ 18 : జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ అన్నారు. ఆయన శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ శ్రుతి ఓఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జిల్లాలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని, విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆయనకు సూచించారు.


- జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కలుసుకుని పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌, ఏడీ ఇందిర, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బీఎస్‌ ఆనంద్‌, పీఆర్‌టీయూ నాయకులు తిమ్మారెడ్డి, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్‌ రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు. 


- నూతన డీఈఓ మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ శుక్రవారం అలంపూరు చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాంను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మారెడ్డి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 


- నూతన డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ను శుక్రవారం జిల్లా బయో సైన్స్‌ ఫోరం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఫోరం ద్వారా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై వినతిపత్రం ఇచ్చారు. భవిష్యత్‌లో చేపట్టనున్న జీవశాస్త్ర అకడమిక్‌ కార్యక్రమాలపై ఫోరం తరఫున మెమోరాండం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా బయో సైన్స్‌ ఫోరం అధ్యక్షులు జే.ఎల్లస్వామి, ఎస్తేరు రాణి, గౌరవ సల హాదారులు పి.రామన్న, అజీజ్‌, టి.నరసింహులు, సభ్యులు జయప్రకాష్‌, వెంకటేశ్వర్లు, పాండు నాయక్‌, సవారన్న, అరవింద్‌ పాల్గొన్నారు.


- డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ను టీఎస్‌టీయూ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రమేష్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మల్లికార్జున, రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పి.జగపతి రెడ్డి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:52:15+05:30 IST