మోహన్‌ బగాన్‌ హ్యాట్రిక్‌

ABN , First Publish Date - 2020-12-04T09:11:55+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. ఒడిశా ఎఫ్‌సీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ 1-0 స్కోరుతో నెగ్గింది...

మోహన్‌ బగాన్‌ హ్యాట్రిక్‌

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. ఒడిశా ఎఫ్‌సీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ 1-0 స్కోరుతో నెగ్గింది. 90వ నిమిషంలో రాయ్‌ కృష్ణ గోల్‌తో బగాన్‌ జట్టు గెలుపొందింది. తొలి అర్ధభాగంలో బగాన్‌ జట్టుకు గోల్‌ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒడిశా కూడా పలు అవకాశాలను వృథా చేసుకొంది. దీంతో ఫస్టాప్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ గోల్‌ కోసం ఇరు జట్లూ హోరా హోరీగా పోరాడాయి. అయితే ఇంజ్యూరీ టైమ్‌లో రాయ్‌ కృష్ణ చేసిన గోల్‌తోనే మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ దక్కించుకొంది.

Updated Date - 2020-12-04T09:11:55+05:30 IST