వరంగల్‌లో మోక్షారామం ఫౌండేషన్ సేవలు

ABN , First Publish Date - 2020-04-05T20:08:11+05:30 IST

కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానంతోపాటు మాస్క్‌లు..

వరంగల్‌లో మోక్షారామం ఫౌండేషన్ సేవలు

వరంగల్: కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానంతోపాటు మాస్క్‌లు పంపిణీ చేసేందుకు పలు స్వచ్చంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. వరంగల్‌లో మోక్షారామం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ సేవలు అందించే సిబ్బందికి ఉచిత అన్నదానం, మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని మోక్షారామం ఫౌండేషన్ ఛైర్మన్ రామా శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం మోక్షారామం ఫౌండేషన్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చాలా రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా నివారణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు పనిచేస్తున్నారని కొనియాడారు. దీనికోసం తమ ఫౌండేషన్ నుంచి రెండు లక్షల మాస్క్‌లు తయారు చేసి ఉచితంగా వరంగల్‌లో పోలీసులు, వైద్యులు, జర్నలిస్టుల మిత్రులకు ఇవ్వాలని సంకల్పించామని చెప్పారు. ఇప్పటివరకు వేలాది మాస్క్‌లు పంపినీ చేశామన్నారు. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత కూడా రక్షణ కోసం మాస్క్‌లు ఉపయోగించాలన్నారు.

Updated Date - 2020-04-05T20:08:11+05:30 IST