Americaలో ఐదుగురు పిల్లల తల్లి కారులో వెళ్తుండగా ఘోరం.. అదే రూట్‌లో వెళ్తున్న వ్యక్తి చూసినప్పటికీ..

ABN , First Publish Date - 2021-11-11T01:51:45+05:30 IST

ఆమెకు ఐదుగురు పిల్లలు. వారిని పోషించుకోవడం కోసం కారు డ్రైవర్‌గా పని చేస్తుంది. రోజూ వెళ్లినట్టుగానే సోమవారం ఉదయమే.. విధులుకు బయల్దేరింది. ఈ క్రమంలో కారులో వెళ్తుండగా ఘోరం చోటు చేసుకుంది. పక్కనే వెళ్తున్న వ్యక్తి ఆ దృశ్యాలను చూసి

Americaలో ఐదుగురు పిల్లల తల్లి కారులో వెళ్తుండగా ఘోరం.. అదే రూట్‌లో వెళ్తున్న వ్యక్తి చూసినప్పటికీ..

ఎన్నారై డెస్క్: ఆమెకు ఐదుగురు పిల్లలు. వారిని పోషించుకోవడం కోసం కారు డ్రైవర్‌గా పని చేస్తుంది. రోజూ వెళ్లినట్టుగానే సోమవారం ఉదయమే.. విధులుకు బయల్దేరింది. ఈ క్రమంలో కారులో వెళ్తుండగా ఘోరం చోటు చేసుకుంది. పక్కనే వెళ్తున్న వ్యక్తి ఆ దృశ్యాలను చూసి నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన క్రిస్ట్రీ కార్డర్‌కు ఐదుగురు పిల్లలు. వారంతా ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. పిల్లలను పోషించుకోవడం కోసం క్రిస్టీ కార్డర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం రోజు కూడా ఆమె తన విధులకు హాజరయ్యారు. అయితే అనుకోకుండా అమె నడుపుతున్న టెస్లా కారు ప్రమాదానికి గురై.. పక్కనే ఉన్న బండరాయిని ఢీ కొట్టింది. ఆ తర్వాత అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్లను ఢీ కట్టింది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఆదే రూట్‌లో వెళ్తున్న మరో డ్రైవర్.. ఈ దృశ్యాలను చూసి, ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే అధికారులు అక్కడికి చేరుకునే లోపే.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు జరపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సదరు డ్రైవర్ మాట్లాడుతూ.. మంటలు ఎగిసి పడటంతో కారు వద్దకు వెళ్లి, ఆమెను కాపాడలేకపోయినట్టు తెలిపారు. కాగా.. క్రిస్టీ మరణంపట్ల ఆమె పిల్లలు చదువుతున్న స్కూలు యాజమాన్యం దిగ్బ్రాంతి  వ్యక్తం చేసింది. 




Updated Date - 2021-11-11T01:51:45+05:30 IST