నేటి నుంచి శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలు

ABN , First Publish Date - 2021-05-17T05:37:44+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం నుంచి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

నేటి నుంచి శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజలు

శ్రీకాళహస్తి, మే 16: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం నుంచి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు పునఃప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఈ పూజలు జరుగుతాయని గుర్తుచేశారు. లోక కల్యాణార్థం, ప్రజల ఆరోగ్యరక్షణ కోసం ఇకపై ప్రతి సోమవారం ఏకాంతంగా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఆర్జిత సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-05-17T05:37:44+05:30 IST