మహిళా సంఘాల సొమ్ము స్వాహా

ABN , First Publish Date - 2021-06-15T06:29:57+05:30 IST

యానిమేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొరివిపల్లి గ్రామ మహిళా సంఘాల సభ్యులు తాము చెల్లించిన రుణ వాయిదాల సొమ్మును యానిమేటర్‌ స్వాహా చేశాడని మండలంలోని కొరివిపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు

మహిళా సంఘాల సొమ్ము స్వాహా
ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న మహిళా సంఘం లీడర్‌

శింగనమల, జూన14 : తాము చెల్లించిన రుణ వాయిదాల సొమ్మును యానిమేటర్‌ స్వాహా చేశాడని మండలంలోని కొరివిపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం శింగనమల పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు...కొరివిపల్లి గ్రామానికి చెందిన 7  మహిళా సంఘాలకు 2015-2016 సంవత్సరంలో గొర్రెలు, మేకల పెంపకం కోసం ఒక్కొక్క మహిళా సంఘానికి ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన నిధులు రూ. 1.5 లక్షలు  మంజూరయ్యాయి.  అప్పటి నుంచి వారు ఈ రుణం చెల్లించడానికి స్థానిక యానిమేటర్‌ ఓబిలేసుకు డబ్బులు ఇచ్చేవారు. ఆయన కొంత మొత్తంను ఖా తాలో జమ చేయకుండానే జమ చేసినట్లు సభ్యురాళ్ల వ్యక్తిగత పుస్తకంలో నమోదు చేశాడు. మహిళలు మాత్రం రుణాలు పూర్తిగా చెల్లించామని అను కున్నారు. ఈక్రమంలో కొత్తగా వచ్చిన సీసీ నగేష్‌ మీ గ్రూపు రుణం ఇంకా చెల్లించాలని చెప్పడంతో స్వాహా పర్వం బయటపడింది. జ్యోతి సంఘం రూ. 25వేలు, అయ్యప్పస్వామి సంఘం రూ. 15 వేలు, దుర్గా సంఘం రూ. 1.2 లక్షలు, లక్ష్మి సంఘం రూ. 10 వేలు, ఎల్లమ్మ సంఘం రూ. 1.5లక్షలు, లక్ష్మి సంఘం రూ. 20 వేలు, లింగేశ్వరీ సంఘం రూ. 50 వేలు జమ చేయకుండా యానిమేటర్‌ స్వాహా చేసినట్లు తేలింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు సీపీఐ మండల కార్యదర్శి చెన్నప్ప యాదవ్‌, మధుయాదవ్‌, రామాంజి, నేసే మధుతో కలిసి ఎస్‌ఐ వంశీకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ స్వాహా వ్యవహారంలో అప్పటి సీసీ, యానిమేటర్‌ ప్రమేయం ఉన్నట్లు మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. 


Updated Date - 2021-06-15T06:29:57+05:30 IST