Abn logo
Sep 24 2021 @ 01:39AM

ట్విటర్‌ పోస్టులతో డబ్బులు!

న్యూఢిల్లీ, సెప్టెంబరు23: ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.