పంప్‌హౌజ్‌లకు మానిటరింగ్‌ సెల్‌!

ABN , First Publish Date - 2020-02-28T10:51:03+05:30 IST

రాష్ట్రంలోని నీటిపారుదల పంప్‌హౌజ్‌ల నిర్వహణ కోసం ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలసౌధలో ఏర్పాటు చేసే ఈ సెల్‌లో ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌ శాఖలకు చెందిన ...

పంప్‌హౌజ్‌లకు మానిటరింగ్‌ సెల్‌!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నీటిపారుదల పంప్‌హౌజ్‌ల నిర్వహణ కోసం ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలసౌధలో ఏర్పాటు చేసే ఈ సెల్‌లో ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌ శాఖలకు చెందిన ఇంజనీర్లను నియమించనున్నారు. ఈ సెల్‌ ఏర్పాటుపై ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం  అధికారులతో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం పంపింగ్‌ స్టేషన్లే ఉన్నాయి. పైగా ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పలు పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. పంప్‌హౌజ్‌ల మధ్య సమన్వయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెల్‌లో ట్రాన్స్‌కోకు చెందిన ఇంజనీర్లను నియమిస్తారు. ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో ఇంజనీర్లు సమన్వయంతో ఈ సెల్‌ను నిర్వహించడానికి వీలుగా చర్యలను తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-02-28T10:51:03+05:30 IST