బైక్‌లో నుంచి రూ. 3 లక్షలు కొట్టేసిన కోతి... ఆ సొమ్మును ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-08-16T13:32:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఒక విచిత్ర ఘటన...

బైక్‌లో నుంచి రూ. 3 లక్షలు కొట్టేసిన కోతి... ఆ సొమ్మును ఏం చేసిందంటే..

హర్దోయి: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒక కోతి... రోడ్డు పక్కన నిలిపివుంచిన బైక్ డిక్కీలో నుంచి క్యాష్ బ్యాగును కొట్టేసి, వెంటనే చెట్టుపైకి ఎక్కికూర్చుంది. దీనిని గమనించిన ఆ బైక్ నడిపిన యువకుడు కంగారెత్తిపోయాడు. 


వివరాల్లోకి వెళితే.. సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆశీష్ సింగ్ అనే యువకుడు తన బైక్ డిక్కీలోని రూ. 3 లక్షల రూపాయల నగదు బ్యాగును కోతి ఎత్తుకుపోయి, చెట్టుపైకి ఎక్కికూర్చుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతలో ఆ కోతి బ్యాగులోని డబ్బును తీసి కింద పడేసింది. దీనిని సమీపంలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు గమనించి, ఆ సొమ్మును తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు. వారు ఆశీష్‌కు ఆ మొత్తాన్ని అందజేశారు. పోలీసులతో పాటు, ఆశీష్ ఆ హోమ్ గార్డు నిజాయితీని మెచ్చుకున్నారు. 


Updated Date - 2021-08-16T13:32:31+05:30 IST