Viral Video: ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఫోన్‌లకు పని చెప్పిన ప్రయాణికులు

ABN , First Publish Date - 2021-10-04T00:02:38+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోకి తాజాగా అనుకోని అతిథి ఎంటరై అక్కడున్న వారిని అందరినీ ఆశ్చర్యపరించింది. వీఐపీ లాంజ్‌లో అందుబాటు

Viral Video: ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఫోన్‌లకు పని చెప్పిన ప్రయాణికులు

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోకి తాజాగా అనుకోని అతిథి ఎంటరై అక్కడున్న వారిని అందరినీ ఆశ్చర్యపరించింది. వీఐపీ లాంజ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి.. అక్కడున్న ఆహార పదార్థాలను టేస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అతిథికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కాగా.. అంతటి భద్రతను దాటి ఎలా వచ్చిందో ఏమో కానీ.. ఓ వానరం ఏకంగా విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకే ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న ఆహార పదార్థాలను టేస్ట్ చేసి హల్‌చల్ చేసింది. ఈ క్రమంలో కొందరు.. ఆ వానరానికి సంబంధించిన దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో  ఎయిర్ పోర్ట్‌లో కోతి విన్యాసాలను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా రకరకాలుగా కామెంట్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. 


Updated Date - 2021-10-04T00:02:38+05:30 IST