Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రీట్‌కు దిగొచ్చిన కోతి.. దొంగిలించిన గ్లాసెస్ వెనక్కి, వీడియో వైరల్!

న్యూఢిల్లీ: మనిషికి, కోతికి చాలా దగ్గరి సంబంధమే ఉందంటారు శాస్త్రవేత్తలు. ‘ఏంటా కోతి పనులు?’ అంటూ మనలోనూ ఓ కోతి ఉందని పెద్దలు అప్పుడో, ఇప్పుడో కోప్పడుతూ గుర్తుచేస్తుంటారు. వీటన్నింటినీ పక్కనపెడితే కోతి ప్రవర్తన, దాని హావభావాలు మనుషుల్ని తలపిస్తూ మీరు మా నుంచే వచ్చారు సుమా! అని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడీ కోతిగోల ఎందుకంటారా? ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఓ కోతికి సంబంధించిన ఉపోద్ఘాతమే ఇదంతా.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మర్కటం ఓ వ్యక్తి కళ్లద్దాలను దొంగిలించింది. వాటిని వెనక్కి ఇవ్వమని ఎంతగా బతిమాలినా ఇవ్వలేదు సరికదా.. వాటిని జారవిడకుండా అలాగే గట్టిగా పట్టుకుని పైకెక్కింది.


కళ్లద్దాలను ఇవ్వమని ఎంతగా ప్రాధేయపడినా ఇవ్వని ఆ వానరం.. చిన్నపాటి ట్రీట్‌ తీసుకుని కళ్లద్దాలను వెనక్కి ఇచ్చింది. పైన కూర్చున్న మర్కటానికి ఫ్రూటీ లాంటి పానీయాన్ని అందిస్తే అప్పుడు అది తాను తీసుకున్న కళ్లద్దాలను వెనక్కి ఇచ్చింది. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘ఏక్ హాత్ దో, ఏక్ హాత్ లో’ (ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకో) అని దానికి క్యాప్షన్ తగిలించారు.


ఈ వీడియోపై నెటిజన్లు నవ్వు తెప్పించే కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే గతంలోని తమ అనుభవాలను గుర్తు చేస్తున్నారు. వస్తుమార్పిడి పద్ధతి అంటే ఇదేనని కొందరంటే.. ఈ కోతిది చిన్నపిల్ల చేష్ట అని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది తప్పకుండా ‘క్విడ్ ప్రొ కొ’యేనంటూ చలోక్తులు విసురుతున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement