Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతర్జాతీయ పోటీలకు మాంటిస్సోరి విద్యార్థి


అనంతపురం విద్య, నవంబరు 29 : నగరంలోని సంగమేష్‌ నగర్‌లోని మాంటిస్సోరి స్కూల్‌ విద్యార్థి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్‌ సూ ర్యనారాయణరెడ్డి తెలిపారు. సోమ వారం విద్యార్థిని కరస్పాండెంట్‌తో పాటు ప్రిన్సిపాల్‌ పద్మావతి, ఇతర టీచర్ల అభినం దించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ మాట్లాడుతూ...స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న నూకల హకేష్‌ ఈ నెలలో కర్ణాటకలోని బెల్గావిలో జరిగిన నేషనల్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచాడన్నారు. దీంతో 600 మీటర్ల విభాగంలో బంగారు పథకం, 300 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచాడన్నారు. త్వరలో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపిక య్యాడన్నారు. ఇతర విద్యార్థులు సైతం హకేష్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. 


Advertisement
Advertisement