నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-11-19T14:05:50+05:30 IST

ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 9వ దశ మెగా వ్యాక్సినేషన్‌ క్యాం

నెలాఖరు నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌

                          - ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం 


అడయార్‌(చెన్నై): ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 9వ దశ మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపును విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో భాగంగా స్థానిక మైలాపూర్‌లో ఆయన వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ క్యాంపులతో పాటు డెంగ్యూ ఫీవర్‌, వర్షాకాల సీజనల్‌ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీకా శిబిరాలతో పాటు సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించే రాష్ట్రంగా నిర్వ హించా ల్సిదిగా ఆయా జిల్లా యంత్రాంగాలను ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మూడు రకాల శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గురువారం 9వ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయగా, 10వ టీకా శిబిరాన్ని వచ్చే ఆదివారం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, 75 లక్షల మంది రెండో డోసు టీకాను వేసుకోలేదని వీరిలో 72 లక్షల మందిని గుర్తించినట్టు తెలి పారు. అదేవిధంగా 74 శాతం తొలి డోసు టీకాను, 36 శాతం మంది రెండో దశ టీకాను వేసుకున్నట్టు వెల్లడించారు. సుదీర్ఘకాలంలో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపడుతు న్నామన్నారు. దీనివల్ల నర్సులతో పాటు ఆరోగ్య కార్యకర్తల కష్టన ష్టాలను అర్థం చేసుకోవాలన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నారు. దీనికి కారణాలను తెలుసుకుం టామన్నారు. అదేసమయంలో నవంబరు నెలాఖరు నాటికి తొలి డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని, ఇందుకు కేంద్రం కూడా సహకరించాలన్నారు. అంతేకాకుండా 18 నుంచి 45 యేళ్ళ వయస్కులకు కరోనా టీకా వేసుకోవాలన్న భావన కలిగిందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు వేస్తామన్నారు. అదేసమయంలో 4800 నర్సుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ జీవోను జారీ చేయడం జరిగిందన్నారు. ఏ జిల్లాలకు ఎంతమంది కావాలో అధ్యయనం చేసి ఆ విధంగా నర్సులను ఆయా జిల్లాలకు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా 108 అంబులెన్స్‌ సిబ్బందికి వేతన పెంపు, ఉద్యోగ భద్రత తదితర కోర్కెలను ప్రభుత్వం ముందు ఉంచారన్నారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-11-19T14:05:50+05:30 IST