14 ఏళ్ల కొడుకును నా భార్యే లైంగికంగా వేధిస్తోంది.. ఓ భర్త పెట్టిన కేసు ఇది.. చివరకు.

ABN , First Publish Date - 2021-06-22T01:37:05+05:30 IST

14 ఏళ్ల కొడుకును తల్లే లైంగికంగా వేధిస్తోందని కేరళలో ఆర్నెళ్ల క్రితం నమోదైన కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

14 ఏళ్ల కొడుకును నా భార్యే లైంగికంగా వేధిస్తోంది.. ఓ భర్త పెట్టిన కేసు ఇది.. చివరకు.

14 ఏళ్ల కొడుకును తల్లే లైంగికంగా వేధిస్తోందని కేరళలో ఆర్నెళ్ల క్రితం నమోదైన కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు సరైన ఆధారాలు లేవని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) తాజాగా నివేదికను సమర్పించింది. కేరళలోని కడకవూర్‌కు చెందిన ఓ మహిళను లైంగిక వేధింపుల కేసు మీద ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. 


తన 14 ఏళ్ల కొడుకుపై తన మాజీ భార్య లైంగిక వేధింపులకు పాల్పడుతోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఆ కేసును పరిశోధించాల్సిందిగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్‌ను కేరళ హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన సిట్.. ఆ మహిళపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవని హైకోర్టుకు తన నివేదికను సమర్పించింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వాటికి అనుకూలంగా ఎలాంటి ఆధారమూ లేదని సిట్ అధికారి తెలిపారు. 


బాలుడి తల్లిదండ్రులు గతంలోనే విడాకులు తీసుకున్నారు. భర్త వేరే పెళ్లి చేసుకుని గల్ఫ్‌లో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కడవకూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి మాజీ భార్యపై లైంగిక వేధింపుల కేసు పెట్టాడు. తనతోపాటు గల్ఫ్ వచ్చినపుడు తన కొడుకే తల్లి అకృత్యాల గురించి చెప్పాడని, లైంగిక వేధింపుల వల్ల అతను మానసిక సమస్యతో బాధపడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాలల సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  


Updated Date - 2021-06-22T01:37:05+05:30 IST