బైడెన్‌ నివాసంలో చంద్రశిల

ABN , First Publish Date - 2021-01-27T12:58:38+05:30 IST

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని తన అధికారిక నివాసంలో అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ అరుదైన వస్తువును ఆయన ఏరి, కోరి తెప్పించుకున్నారు. అదే.. చంద్రశిల(మూన్‌రాక్‌). 1972లో అపోలో-17 మిషన్‌ ద్వారా చంద్రుడిపై నుంచి ‘నాసా’ వ్యోమగాములు..

బైడెన్‌ నివాసంలో చంద్రశిల

నాసా నుంచి తెప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు


వాషింగ్టన్‌,  జనవరి 26 : అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని తన అధికారిక నివాసంలో అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ అరుదైన వస్తువును ఆయన ఏరి, కోరి తెప్పించుకున్నారు. అదే.. చంద్రశిల(మూన్‌రాక్‌). 1972లో అపోలో-17 మిషన్‌ ద్వారా చంద్రుడిపై నుంచి ‘నాసా’ వ్యోమగాములు సేకరించిన రాళ్ల నమూనాల్లో అది ఒకటి. ‘లూనార్‌ శాంపిల్‌ 76015, 143’ అని పిలిచే ఆ మూన్‌ రాక్‌ను బైడెన్‌ సూచనమేరకు ఆయన సహాయక యంత్రాంగం నాసా లేబొరేటరీ నుంచి తెప్పించింది.  బైడెన్‌ కూర్చునే ప్రధాన డెస్క్‌కు పక్కనే గోడకు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చిత్రపటం తగిలించి ఉంటుంది. దాని పక్కనే ఉండే బుక్‌ షెల్ఫ్‌ అడుగుభాగంలో మూన్‌ రాక్‌ను అమర్చారు. 

Updated Date - 2021-01-27T12:58:38+05:30 IST