Abn logo
Sep 20 2021 @ 18:15PM

జగన్ పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది: మోపిదేవి

గుంటూరు: జెడ్పీటీసి ఎంపీటీసి ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్ పరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు అప్పటి ఎన్నికల కమిషన్, చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. కానీ ప్రజాతీర్పుతో వారంతా బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. ఎన్నికలు బహిష్కరించామని చెప్పి టీడీపీ బీ ఫారాలు ఎలా ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. కేఏపాల్ పార్టీ కంటే చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబుని ప్రజలు పక్కన పెట్టారని విమర్శించారు. అక్కడి ప్రజలు కూడా వైసీపీకి పట్టం కట్టారని చెప్పారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఎన్నికలు బహిష్కరించటం వారి దుస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే జగన్ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. దుగ్గిరాలో ఎందుకు సరైన ఫలితాలు రాలేదో సమీక్షించుకుంటామని చెప్పారు. అందుకు కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.