కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-17T06:01:36+05:30 IST

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని యువత ఎదగాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
విగ్రహావిష్కరణలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, బ్రహ్మనాయుడు

నరసరావుపేటలో విగ్రహావిష్కరణ సభలో మోపిదేవి

నరసరావుపేట, అక్టోబరు 16: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని యువత ఎదగాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. స్థానిక పల్నాడురోడ్డులో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతిగా, శాస్త్రవేత్తగా కలాం చేసిన సేవలను మోపిదేవి కొనియాడారు. అనంతరం మైనార్టీ షాపింగ్‌ కాంప్లెక్స్‌, జామియా మసీదు నిర్మాణానికి భూమిపూజ చేశారు. మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మోపిదేవి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ముస్తఫా, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మైనార్టీ కార్పొరేషన చైర్మన షేక్‌ అసీఫ్‌, సీఈవో హలీం భాష, తెనాలి, వినుకొండ మునిసిపల్‌ చైర్మన్లు ఖలీదా నసీమా, సప్తగిరి,  షేక్‌ కార్పొరేషన చైర్‌పర్సన షేక్‌ ఆషాబేగం, మార్కెట్‌ యార్డు చైర్మన షేక్‌ హనీఫ్‌, స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన డైరెక్టర్‌ సుజాతపాల్‌, షేక్‌ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T06:01:36+05:30 IST