Abn logo
Sep 19 2021 @ 00:30AM

మత్స్యకారుల మనుగడ ప్రశ్నార్థకం

కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న మత్స్యకారులు

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 18: హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం జీవో 217 తీసుకువచ్చి తమ మనుగడ ప్రశ్నార్థకం చేసిందని మత్స్యకార సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి మెపిదేవి శ్రీనివాసరావు తెలిపారు. మత్స్యకారుల జీవోనపాధిని దెబ్బతీసే జీవోలను ఉపసంహరించుకోవాలంటూ శనివారం కలెక్టరేట్‌లోని మత్స్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంతం, నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లో చేపలు పెంచుకుని, పట్టి జీవనం సాగిస్తున్న వారి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఫిషరీస్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీస్‌ సరైన ఆదాయం చూపటంలో విఫలమవ్వడం వల్లే ఈ జీవో తెచ్చామని ప్రభుత్వం చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. సొసైటీ విఫలమయితే వాటి బలోపేతానికి కృషిచేయాలిగాని పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. అనంతరం జీవోను రద్దు చేయాలని కోరుతూ జేడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దేవరకొండ కోటయ్య. శ్రీను, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.