గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ ఒక్క చిన్న మాట.. కొండంత ప్రేరణ అందించి.. తక్షణం జీవితాన్నే మార్చివేస్తుంది

ABN , First Publish Date - 2021-11-14T13:00:59+05:30 IST

ఒకరోజు గౌతమ బుద్ధుడు శిష్యుల ముందు..

గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ ఒక్క చిన్న మాట.. కొండంత ప్రేరణ అందించి.. తక్షణం జీవితాన్నే మార్చివేస్తుంది

ఒకరోజు గౌతమ బుద్ధుడు శిష్యుల ముందు ఉపన్యసిస్తున్నాడు. వీటిని వినడానికి ఒక వ్యక్తి ప్రతిరోజూ అక్కడికి వచ్చేవాడు. బుద్ధుడు తన ప్రసంగాలలో దురాశ, అహంకారం, ద్వేషం మొదలైనవాటిని విడిచిపెట్టడం గురించి చెబుతుండేవాడు. ఒకరోజు ఆ వ్యక్తి గౌతమబుద్ధుని దగ్గరకు వచ్చి.. ‘‘అయ్యా  నేను గత నెల రోజులుగా మీ ప్రసంగాలను క్రమం తప్పకుండా వింటున్నాను. అయితే అవి నాపై ఎలాంటి ప్రభావాన్నీ చూపలేదు. నాలో ఏదైనా లోపం ఉందా, లేదా దానికి కారణం వేరేదైనావుందా?’ అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తిని ఇలా అడిగాడు.. ‘నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు?’ అతను జవాబిచ్చాడు ‘శ్రావస్తీ’ అని. బుద్ధుడు మళ్లీ అడిగాడు, 'నువ్వు మీ గ్రామమైన శ్రావస్తికి ఎలా వెళ్తావు?' ఆ వ్యక్తి బదులిచ్చాడు.. 'నేను కొన్నిసార్లు ఎడ్లబండిలో, కొన్నిసార్లు గుర్రంపైన వెళ్తాను’ తిరిగి బుద్ధుడు.. ‘మీ గ్రామానికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది?’ అని అడిగాడు. దీనికి ఆ వ్యక్తి ఏదో లెక్కపెట్టి చెప్పాడు. 


వెంటనే బుద్ధుడు.. ‘ఇప్పుడు ఇక్కడ కూర్చుంటునే మీరు శ్రావస్తీకి చేరుకోగలరా? అని అడిగాడు. దీనికి అతను ఆశ్చర్యపోతూ.. 'నేను ఇక్కడే కూర్చుని శ్రావస్తికి ఎలా చేరగలను? అక్కడికి చేరుకోవాలంటే నేను కనీసం నడవాలి లేదా ఏదైనా వాహనం సహాయం తీసుకోవాలి’ అని అన్నాడు. వెంటనే బుద్ధుడు ఇలా అన్నాడు.. 'ఎవరైనా ప్రయత్నపూర్వకంగా.. కనీసం కాలినడకతోనైనా వారి గమ్యాన్ని చేరుకోగలరని మీరు ఖచ్చితంగా చెబుతున్నారు. ఈ విధంగా గమ్యాన్ని చేరుకునే మార్గాలను జీవితంలో అనుసరించాలి. అందుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి’ అని అన్నాడు. బుద్ధుని ఈ మాటలు విన్న వ్యక్తి.. ‘ఇప్పుడు నా తప్పేమిటో నాకు అర్థమైంది. మీరు చూపిన బాటలో ఈరోజు నుంచే నడుస్తాను' అని అన్నాడు. బుద్ధుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. కేవలం ఉపన్యాసం వినడం లేదా అధ్యయనం చేయడం వల్ల ఏమీ పొందలేమని, దానిని ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే లబ్ధి పొందగలమని బుద్ధుడు ఈ ఉదాహరణ ద్వారా తెలియజేశాడు. 



Updated Date - 2021-11-14T13:00:59+05:30 IST