రోగులకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలి

ABN , First Publish Date - 2021-08-01T05:57:14+05:30 IST

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేలా వై ద్యులు అంకితభావంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు.

రోగులకు మరిన్ని మెరుగైన సేవలను అందించాలి
సిబ్బందిని సన్మానిస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత

ప్రభుత్వ ప్రధాన వైధ్యశాల అభివృధ్ది కమిటీ సమావేశం- పాల్గొన్న ఎమ్మెల్యే

జగిత్యాల టౌన్‌, జూలై 31: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేలా వై ద్యులు అంకితభావంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో జగిత్యాల ప్ర భుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి సంఘం సమీక్ష సమావేశాన్ని సంఘం అధ్యక్షురాలు దావ వసంత అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం సభ్యులు ఆసుపత్రిలోని అన్ని విభాగాల సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ రోగులకు, వైద్యులకు సరైన అవగాహ న లేక ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఓపీ సం ఖ్య పెంచేలా వైద్యులు ఉత్తమ సేవలందించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన వైద్యులతో పాటు సిబ్బందిని సన్మానించారు. ఈ సమీక్ష స మావేశంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుదక్షిణా దేవి, ఆర్‌ఎంవో రామకృష్ణ, సభ్యులు బోగ శ్రావణి, స్వర్ణలత, రాజేంద్ర ప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2021-08-01T05:57:14+05:30 IST