చైనాపై మరోసారి కన్నెర్రజేసిన అమెరికా అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2020-07-02T07:35:59+05:30 IST

అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి కన్నెర్ర

చైనాపై మరోసారి కన్నెర్రజేసిన అమెరికా అధ్యక్షుడు!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై మరోసారి కన్నెర్ర చేశారు. కరోనా వైరస్‌.. చైనా ల్యాబ్‌లోనే తయారైందని పలుమార్లు ఆరోపించిన ట్రంప్.. తనకు చైనాపై రోజురోజుకీ కోపం పెరిగిపోతోందంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మహమ్మారిపై తాము పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించలేదని అమెరికన్ వైద్యులు ట్రంప్‌కు తెలిపిన తర్వాత.. ట్రంప్, పై వ్యాఖ్యలు చేశారు. కాగా.. అమెరికాలో గత కొద్ది రోజులుగా ప్రతిరోజు 40వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 27.51లక్షల మంది కరోనా బారినపడగా.. 1.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-02T07:35:59+05:30 IST