విద్య, వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-10-24T06:43:14+05:30 IST

రాబోయే రోజుల్లో విద్య, వైద్యరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వనుందని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.

విద్య, వైద్య రంగాలకు మరింత ప్రాధాన్యం
సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

 - వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు

వేములవాడ టౌన్‌, అక్టోబరు 23: రాబోయే రోజుల్లో విద్య, వైద్యరంగాలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వనుందని ఎమ్మెల్యే డాక్టర్‌ చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయం లో శనివారం సాయంత్రం పట్టణ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు మాట్లాడుతూ  క్లిష్ట మైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చు కున్నామని, ఈ 7 సంవత్సరాల్లో  గణనీయ మైన అభివృద్ధిని సాధించామని  అన్నారు. రాష్ట్రంలో ఆరు నెలలుగా విద్య, వైద్యరంగాల మార్పుపై సుదీర్ఘచర్చ జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరికి నాణ్య మైన విద్య, వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తోందన్నారు.  ఎమ్మెల్యే కోటా కింద రూ.5 కోట్లు వచ్చే అవకాశం ఉందని, అందులో నుంచి రూ. 3 కోట్లు  పాఠ శాలల అభివృద్ధికి కేటాయిస్తానని తెలిపారు.  మరో కోటి  సేవ్స్‌ స్వచ్ఛంద సంస్థ నుంచి అందజేసి పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాజన్న ఆలయ ఆలయ అభివృద్ధికి  కృషి చేస్తున్నట్లు చెప్పారు.  పట్టణ సమగ్ర అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ రూ. 20 కోట్ల నిధులు అందించనున్నట్లు చెప్పారు. పట్టణంలోని సమస్యలపై చర్చించామని, త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపబోతు న్నామని తెలిపారు. అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తున్నాయని,  వారి మాటలు పట్టించుకోకుండా అభివృద్ధి పనలుఉ చేసుకుపోవాలని నాయకులకు సూచించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పాటుపడుతాను కాబట్టే ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.  అంకితభావంతో ప్రజలకు సేవ చేయా లనే ఉద్దేశంతో ముందుకొచ్చే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు.    పిచ్చి వేశాలు వేసే వారిని టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించబోమని, అలాంటి వారు పార్టీలోకి రాకుంటేనే మంచిదని అన్నారు. త్వరలో టీఆర్‌ఎస్‌ జిల్లా కమిటీని వేయబోతున్నారని పార్టీకి అంకితభావంతో పని చేసే వారు  ఎవరో తనకు తెలుసని, వారికి పదవులు దక్కుతాయని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవిరాజు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస్‌రావు, గూడురి లక్ష్మీమధు, మారం కుమార్‌, బింగి మహేష్‌, నీరటి సువర్ణమల్లేశం  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:43:14+05:30 IST