క‌రోనా క‌ల్లోలం: ఈ రెండు నెల‌ల్లో మ‌రింత‌గా వ్యాప్తి!

ABN , First Publish Date - 2020-07-02T14:55:38+05:30 IST

దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించి ఆరునెల‌ల‌య్యింది. దీని ప్ర‌భావం జూన్‌లో అత్యధికంగా కనిపించింది. కేసులు గ‌రిష్ట‌స్థాయికి చేరుకున్నాయి.

క‌రోనా క‌ల్లోలం: ఈ రెండు నెల‌ల్లో మ‌రింత‌గా వ్యాప్తి!

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించి ఆరునెల‌ల‌య్యింది. దీని ప్ర‌భావం జూన్‌లో అత్యధికంగా కనిపించింది. కేసులు గ‌రిష్ట‌స్థాయికి చేరుకున్నాయి. లాక్‌డౌన్‌ కూడా ఎత్తివేశారు. జూన్ మాదిరిగానే జూలై కూడా కూడా క‌రోనా కేసులు అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జూన్‌లో 3.48 లక్షల మందికి పైగా క‌రోనా సోకినట్లు గుర్తించారు. కేసుల న‌మోదు, మ‌ర‌ణాల సంఖ్య  జూన్‌లో ఎక్కువగా కనిపించింద‌ని డేటా నిపుణులు దీపెందర్ రాయ్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివ‌రాల ప్రకారం మే 31 వరకు దేశంలో మొత్తం క‌రోనా రోగుల సంఖ్య 1,82,143 కాగా, 5,164 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం రోగుల సంఖ్య 5, 85,493కు చేరుకుంది. 17,400 మంది మృతిచెందారు. జూలైలో ఐదు నుంచి ఆరు లక్ష‌ల కొత్త కేసులు నమోదు కానున్నాయ‌ని కేరళకు చెందిన‌ సీనియర్ డేటా నిపుణులు జేమ్స్ విల్సన్ అభిప్రాయపడ్డారు. జూలైలో, జూన్‌కు మించి అధిక సంఖ్య‌లో కేసులు, మరణాలు నమోదు కావ‌చ్చ‌న్నారు. కాగా జూలై, ఆగస్టు నెలల్లో క‌రోనా కేసులు పీక్ స్టేజ్‌కి రావ‌చ్చ‌ని చెన్నైలోని నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రొఫెసర్ ఎం రామస్వామి అంచ‌నావేశారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేప‌ధ్యంలో ఆరోగ్య సేవలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-02T14:55:38+05:30 IST