దూర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-06-24T05:45:17+05:30 IST

దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

దూర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, జూన్‌ 23: దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌  డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

రూర్కెల-జగదల్‌పూర్‌

08107 నంబరు గల రైలు ఈనెల 28 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6.20 గంటలకు రూర్కెలలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.10 గంటలకు జగదల్‌పూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08108 నంబరు గల రైలు ఈ నెల 29 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2.10 గంటలకు జగదల్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు రూర్కెల చేరుతుంది.  

రూర్కెల-గుణుపూర్‌

08127 నంబరు గల రైలు ఈ నెల 27 నుంచి ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో రాత్రి 9.50 గంటలకు రూర్కెలలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1.50 గంటలకు గుణుపూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08128 నంబరు గల రైలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు గుణుపూర్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 7.25 గంటలకు రూర్కెల చేరుతుంది.  

వీటితోపాటు ఈ నెల 25 నుంచి ప్రతి సోమవారం హటియా-ఎర్నాకులం(02409), జూలై ఒకటి నుంచి ప్రతి గురు వారం ఎర్నాకులం-హటియా(02410); ఈ నెల 25 నుంచి ప్రతి శుక్రవారం యశ్వంత్‌పూర్‌-గౌహతి(06577), ఈ నెల 28 నుంచి ప్రతి సోమవారం గౌహతి-యశ్వంత్‌పూర్‌(06578); ఈ నెల 26 నుంచి ప్రతి శనివారం యశ్వంత్‌పూర్‌-భగల్‌పూర్‌(02253), ఈ నెల 30 నుంచి ప్రతి బుధవారం భగల్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌(02254); జూలై ఒకటి నుంచి ప్రతి గురువారం గౌహతి-సికింద్రాబాద్‌(02514), జూలై మూడు నుంచి ప్రతి శనివారం సికింద్రాబాద్‌-గౌహతి(02513) ప్రత్యేక రైళ్లు అందుబాటులో వుంటాయని రైల్వే అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-06-24T05:45:17+05:30 IST