Abn logo
Sep 18 2020 @ 17:09PM

కొల్లూరులో 18 నెలల్లోనే 15 వేల ఇండ్లను నిర్మించాం: మంత్రి తలసాని

Kaakateeya

సంగారెడ్డి: రామచంద్రాపురం కొల్లూరులో 18 నెలల్లోనే 15 వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రాపురం కొల్లూరులో డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొల్లూరులో నిర్మించిన ఇండ్లను స్థానికులకు 10 శాతం, హైదరాబాద్‌ వారికి 90 శాతం కేటాయిస్తామని తెలిపారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో జీహెచ్‌ఎంసీని నాశనం చేశారని, ఖాళీ స్థలాలు లేకుండా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరిని చూసి ప్రజలు ఛీకొడుతున్నారని అన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ భట్టి విక్రమార్క సవాల్‌ను ధైర్యంగా స్వీకరించామని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తామంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement