తగ్గని వైరస్‌ ఉధృతి

ABN , First Publish Date - 2020-08-13T10:58:22+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు 1,700పైగానే కేసులు నమోదయ్యాయి. వైరస్‌ విజృంభణతో స్వచ్ఛoద లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నా కరోనా

తగ్గని వైరస్‌ ఉధృతి

జిల్లాలో 1,700 దాటిన పాజిటివ్‌ కేసులు

జూలై, ఆగస్టులోనే వెయ్యికి పైగా కేసుల నమోదు 

ప్రతీరోజు 50కి పైనే నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు

పెరుగుతున్న కొవిడ్‌ మరణాల సంఖ్య

ఇప్పటి వరకు కరోనాతో 19 మంది మృతి

జిల్లా వ్యాప్తంగా విస్తరించిన వైరస్‌

స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రాంతాల్లోనూ తగ్గని కరోనా విజృంభణ

రెండు రోజుల్లో ర్యాపిడ్‌ సర్వే నిర్వహించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ప్రజల భయాన్ని ఆదాయంగా మార్చుకుంటున్న పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు


కామారెడ్డి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటి వరకు 1,700పైగానే కేసులు నమోదయ్యాయి. వైరస్‌ విజృంభణతో  స్వచ్ఛoద లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రతీరోజు జిల్లాలో యాబైకి పైగానే కేసులు నమోదవుతునే ఉన్నాయి.  జూలై, ఆగస్టు ఈ రెండు మాసాల్లోనే వెయ్యి కేసులకు పైగానే నమోదయ్యాయంటే కరోనా వైరస్‌ ఏ స్థాయిలో విస్తరిస్తుం దో అర్థమవుతోంది. పాజిటివ్‌ కేసులతో పాటు, కొవిడ్‌ మరణాల సంఖ్య సైతం పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 మంది కరోనా తోని మృతి చెందగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ మాత్రం 7 గురు మృతి చెందారని చెబుతున్నారు. జిల్లాలోని పట్టణాలు, మారుమూల గ్రామాలు అని తేడా లేకుండా వైరస్‌ అంతటా విస్తరించింది. దీంతో జిల్లా అధికారులు కరోనా భారిన పడిన వారికి వైద్యం అందించేం దుకు క్వారంటైన్‌ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి కూడా మెడిసిన్‌లు అందిస్తున్నారు. అయి తే మరో రెండు రోజుల్లో ఎన్నికల మాదిరి బూత్‌లెవల్‌ నుంచి ఇం టింటికీ వెళ్లి ర్యాపిడ్‌ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ శరత్‌ అధికారు లను ఆదేశించారు. సర్వే అనంతరం మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించి సీజనల్‌, కొవిడ్‌ కేసులను నిర్ధారించి ప్రజలకు తగు విధమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.


రెండు నెలల్లోనే 1,500 పైగా కేసులు

లాక్‌డౌన్‌ మార్చి నెలలో 5 కేసు లు నమోదు కాగా ఏప్రి ల్‌లో 7, మే నెలలో ఏ కేసు నమోదు కాలేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత జూన్‌లో 47, జూలైలో 796, ఆగస్టులో ఇప్పటి వరకు 900లకు పైగానే కేసులు నమోద య్యాయి.  నెలవారీగా నమోదయిన కేసులను బట్టి చూస్తే జిల్లాలో వైరస్‌ ఏ స్థాయిలో విస్తరించి ఉందో తెలుస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న కొద్ది మరణాల సంఖ్య కూడా పెరుగుతునే ఉన్నాయి.  మార్చి నుంచి జూన్‌ వరకు పదుల సంఖ్యలోనే నమోదయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య జూలై నెల చివరి వరకు 800 వరకు కేసులు నమోదు కాగా ఆగస్టు నెలలో కేవలం పన్నెండు రోజుల కాలంలోనే 900పైనే కేసులు నమోదవుతూ వైరస్‌ ఒక్క సారిగా విరుచు కుపడుతోంది. ప్రతీ రోజు 50కి పైగానే కేసులు నమోదవు తున్నాయి. ఇలా ఆగస్టు నెలలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయంటే వైర స్‌ తీవ్రత ఎలా ఉందో తెలు స్తోం ది. ఈ నెలలో సీజనల్‌ వ్యాధు లకు పెట్టిన పేరు దీనికి తోడు పండుగలు, శుభకార్యాలు మెం డుగానే ఉంటాయి. ఈ నెల ప్రారంభ మైన రెండు వారా ల్లోనే అత్యధిక కేసులు నమోద వుతున్నాయంటే నెల చివరి కల్లా ఎన్ని కేసులు నమోదవు తాయేనని సర్వత్రా ఆందోళన నెలకొంటుంది.


జిల్లాలో 19 కొవిడ్‌ మరణాలు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఓ వైపు విపరీతంగా పెరుగుతునే ఉండగా మరోవైపు మరణాల సంఖ్య సైతం ఎక్కువవు తున్నాయి. జిల్లాలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 19మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఏడుగురు మాత్రమే మృతి చెందిన ట్లు ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో కరోనాతో ఇప్పటి వరకు 6గురు మృతి చెందగా, బాన్సువాడలో 4, గాంధారిలో 1, తాడ్వాయిలో 1, రాజంపేటలో 1, భిక్కనూర్‌ లో 1, బీర్కూర్‌లో 1, ఎల్లారెడ్డిలో 1 మృతి చెందగా ఇటీవల మాచారెడ్డి మండలంలో మరో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో చాలా మంది ఆయా ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక రోగాలతో చికిత్స పొందుతూ మృతి చెందగా అనంతరం నిర్వహించిన రక్తనమూనాల పరీక్షలో కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక జబ్బులకు కరోనా తోడవడంతో రోగుల పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తేలుతోంది. మరికొందరు ఎలాంటి రోగాలు లేకున్నప్ప టికీ కరోనా వైరస్‌ సోకి చికిత్స పొందుతునే మృతి చెందారు.


కేసుల పెరుగుదలతో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అఖిలపక్షం సభ్యులు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా లాక్‌డౌన్‌ చేపట్టేందుకు నిర్ణ యించారు. కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే గత వారం రోజుల నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ గడువు నిర్ణయించినప్పటికీ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, అఖిల పక్షం ఆధ్వర్యంలో లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఉదయం 10గంటల నుం చి 5గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరవాలని నిర్ణయిం చారు. ఇక బాన్సువాడ, ఎల్లారెడ్డి, దోమకొండ లాంటి ప్రాంతాలతో పాటు బిచ్కుంద, గాంధారి తదితర మండలాల్లో ఆయా గ్రామ పంచాయతీలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు తీర్మానం చేస్తున్నారు. అయినా ప్రజలు మాత్రం నిబ ంధనలను బేఖాతారు చేస్తూ శుభ కార్యాల్లో పెద్దసంఖ్యలో బంధువులు హాజరు అయ్యేలా చూస్తున్నారు. దీంతో కేసుల సంఖ్య మరింత పెరుగుతు ందనే వాదన లేకపోలేదు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేస్తూనే క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలు గాలికి వదిలేస్తుండడం స్థానికం గా ఉండే అధికారులు, నాయకుల ఉదాసీనత వల్ల తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారకులు అవుతున్నారని సమాచారం.


ప్రజల భయాన్ని ఆదాయంగా మార్చుకుంటున్న పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు

సీజనల్‌ వ్యాధుల కారణంగా సాధారణ జ్వరం వచ్చినా వర్షంలో తడిసి జలుబు చేసిన కరోనా వైరసే అని అనుకుంటూ పరీక్షల నిమిత్తం ఆసుప త్రులకు పరుగులు తీస్తున్నారు ప్రజలు. అయితే ప్రజల భయాన్ని కొందరు ప్రైవేట్‌ ఆసుప త్రుల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ఎక్స్‌రే, సిటీ స్కాన్‌ లాంటివి చేయించి హైదరాబాద్‌లో తమకు అనుకూలంగా, కమీష న్‌లు అందించే ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారే విమర్శలు వ్యక్తం అవు తున్నాయి.


సాధారణంగా కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటే ఎక్కువగా పొడి దగ్గు, తీవ్ర జ్వరం, శ్వాసలో ఇబ్బందితో పాటు ఆగకుండా తుమ్ములు వస్తాయంటూ వైద్యనిపుణులు పేర్కొంటుండగా సీజనల్‌ వ్యాధుల వల్ల వచ్చే లక్షణాలు ఏ విధంగా ఉంటాయే తెలిసిన వైద్యులు అసలు కేవలం వైద్యం కోసం కాకుండా కేవలం ఆదాయం కోసం మాత్రమే సేవలు అందిస్తామనే ఆలోచనలు చేస్తూ ప్రజల భయాన్ని ఆదాయంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా నుంచి హైదరాబాద్‌ తదితర ప్రైవేట్‌ ఆసుపత్రికి రిఫర్‌చేసిన కేసులను పరిశీలిస్తే పలువురు ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాహకులు చేస్తున్న దందా బయటపడే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొం దరైతే మరో అడుగు ముందుకు వేసి కొవిడ్‌ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రులలో చేసుకొని రండి.. పాజిటివ్‌ వస్తే  మీకు కావాల్సిన మెడిసిన్‌తో పాటు నిత్యం సేవలు అందించేందుకు తాము సహకరిస్తాం కానీ మా వద్దే మెడిసిన్‌లు తీసుకోవాలనే సలహాలు ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. 

Updated Date - 2020-08-13T10:58:22+05:30 IST