భారీ భూకంపం.. 29 మంది మృతి

ABN , First Publish Date - 2021-08-15T08:20:59+05:30 IST

కరీబియన్ దీవి హైతిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 మాగ్నిట్యూడ్‌తో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ..

భారీ భూకంపం.. 29 మంది మృతి

ఇంటర్నెట్ డెస్క్: కరీబియన్ దీవి హైతిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 మాగ్నిట్యూడ్‌తో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో చిక్కుకుని 29 మంది వరకు చనిపోయినట్లు హైతి సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఇంకా అనేకమంది శిథిలాల కింద ఇరుక్కుని ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా సంభవించిన భూకంపంతో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భీతావహులైన ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు. కాగా.. భూకంపం కేంద్రం హైతి రాజధాని పోర్టావ్ ప్రిన్స్‌ నగరానికి దాదాపు 100 మైళ్లు(160 కిలోమీటర్లు) దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో హైతి ప్రజలకు ప్రపంచ దేశాల ప్రజలు సానుభూతి తెలుపుతున్నారు.


ఇదిలా ఉంటే ఈ భూకంపాన్ని 2010లో హైతి నగరంలోనే సంభవించిన మరో భూకంపంతో అక్కడి ప్రజలు పోల్చుతున్నారు. అప్పడు సంభవించిన భూకంపం కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో భవనాలు నేలమట్టమయ్యాయని, దేశం మొత్తం కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక కష్టాలు అనుభవించినందని గుర్తు చేసుకుంటున్నారు.

Updated Date - 2021-08-15T08:20:59+05:30 IST