Abn logo
Sep 19 2021 @ 08:13AM

ప్రధాని బర్త్ డే నాడు 2.5 కోట్లమందికి వ్యాక్సిన్... తరువాత 85.2 లక్షల మందికే వ్యాక్సిన్... ఎంత తేడా!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజున (గురువారం) దేశంలో రికార్డు స్థాయిలో 2.5 కోట్లకు పైగా జనాభాకు టీకాలు వేశారు. శుక్రవారం వచ్చేనాటికి కేవలం 17 గంటల వ్యవధిలో 2.5 కోట్లకు పైగా జనాభాకు టీకాలు వేశారు. అయితే శనివారం నాటికి ఈ రికార్డు అమాంతం ఊహించనంత స్థాయిలో దిగజారిపోయింది. 

కోవిన్ యాప్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం శనివారం కేవలం 85.2 లక్షల జనాభాకు మాత్రమే టీకాలు వేశారు. ఈ వైరస్ ముప్పు ఇంకా మనమధ్య నుంచి పోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పండుగల సీజన్ అనంతరం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయని వారు అంచనాలు వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా మెలగాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption