ఏటా 100 మంది సైనికులు ఆత్మహత్య... కారణాలివే!

ABN , First Publish Date - 2021-01-09T17:27:29+05:30 IST

భారత సైన్యంలో ప్రత్యర్థులతో జరిగే యుద్ధాల్లో చనిపోయేవారి కన్నా...

ఏటా 100 మంది సైనికులు ఆత్మహత్య... కారణాలివే!

న్యూఢిల్లీ: భారత సైన్యంలో ప్రత్యర్థులతో జరిగే యుద్ధాల్లో చనిపోయేవారి కన్నా ఆత్మహత్యల కారణంగా చనిపోతున్నజవానుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీనితోపాటు భారత సైన్యంలోని సగం మంది సైనికులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. థింక్ ట్యాంక్ యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా(యూఎస్ఐ) జరిపిన అధ్యయనంలో భారత సైన్యానికి సంబంధించిన పలు విషయాలు వెలుగుచూశాయి. భారత సైన్యంలో ప్రతీయేటా ఆత్మహత్యల కారణంగా వందకు పైగా జవానులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 


భారతసైన్యంలో ప్రతీ మూడో రోజూ ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. దీనికితోడు ఒత్తిడి, అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యల కారణంగానూ పలువురు జవానులు ప్రాణాలు కోల్పోతున్నారు. యూఎస్ఐ సీనియర్ రీసెర్చ్ ఫెలో కర్నల్ ఏకే మోర్ మాట్లాడుతూ భారతీయ సైనికులు దీర్ఘకాలం పాటు ఉగ్రవాదులు, విద్రోహులతో పోరాడుతూ, అటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణంగా వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గడచిన రెండు దశాబ్దాలలో ఆపరేషన్, నాన్ ఆపరేషన్ల కారణంగా భారతీయ సైనిలకులలో ఒత్తిడి స్థాయి పెరిగిందన్నారు. దీనికితోడు సైనికుల సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, ఇంటి సమస్యలు, ఉన్నతాధికారుల నుంచి అప్పుడప్పుడూ ఎదురయ్యే అవమానాలు, మొబైల్ ఫోను వాడకంలో నిబంధనలు మొదలైనవన్నీ జవానుల ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాయి. ఈ కారణాలతోనే కొంతమంది  జవానులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూఎస్ఐ అధ్యయనంలో వెల్లడయ్యింది. 

Updated Date - 2021-01-09T17:27:29+05:30 IST