గుడ్ న్యూస్.. దేశంలో పెరుగుతున్న మహిళల సంఖ్య

ABN , First Publish Date - 2021-11-26T03:02:34+05:30 IST

దేశంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్న వేళ జాతీయ కుటుంబ

గుడ్ న్యూస్.. దేశంలో పెరుగుతున్న మహిళల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతోందని ఆందోళన చెందుతున్న వేళ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) శుభవార్త చెప్పింది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ నిర్వహించిన ఐదో సర్వే ఫలితాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో తొలిసారి పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నట్టు తేలింది.


ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,020 మంది మహిళలు ఉన్నట్టు ఈ సర్వేలో లెక్కతేలింది. 1990లో ప్రతి 1000 మంది పురుషులకు 927 మంది మహిళలే ఉండేవారు. దీంతో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ‘మిస్సింగ్ విమెన్’ అనే పదాన్ని ఉపయోగించారు. 2005-06లో నిర్వహించిన ఎన్ఎఫ్ఎస్-3లో స్త్రీపురుషుల నిష్పత్తి 1000:1000గా ఉండగా, 2015-16లో నిర్వహించిన ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4లో ఈ నిష్పత్తి 991:1000కి పడిపోయింది. తాజాగా నిర్వహించిన ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5లో ఇది ఏకంగా  1020:1000గా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

చిన్నారులు, మహిళల్లో మాత్రం రక్తహీనత ఆందోళన కలిగిస్తోందని సర్వే పేర్కొంది. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సగానికి సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు పేర్కొంది. ఇక, దేశవ్యాప్తంగా చూసుకుంటే పిల్లలో పోషకాహార సూచీల్లో కొంత మెరుగుదల కనిపించింది. సంతానోత్పత్తి రేటు 2.2 శాతం నుంచి 2.0 శాతానికి తగ్గింది. ఫలితంగా దేశ జనాభా అపరిమితంగా పెరిగిపోతోందన్న వాదనకు చెక్ పడింది.  

Updated Date - 2021-11-26T03:02:34+05:30 IST