Abn logo
Oct 9 2021 @ 07:55AM

Lakhimpur Kheri:నేడు యూపీ పోలీసుల ఎదుట హాజరు కానున్న మంత్రి కుమారుడు

న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింసకాండ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ముందు హాజరుకానున్నారు.లఖింపూర్ ఖేరీ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా నివాసం వెలుపల శుక్రవారం మరో నోటీసును అతికించారు.తన కుమారుడు ఆరోగ్య కారణాల వల్ల పోలీసులకు ఫిర్యాదు చేయలేక పోయాడని మంత్రి అజయ్ మిశ్రా చెప్పారు. శుక్రవారం లఖింపూర్ ఖేరీలోని నివాసానికి వచ్చిన మంత్రి అజయ్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. 

లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రాను అక్టోబరు 9వతేదీన శనివారం తమ ముందు హాజరుపర్చాలని కోరుతూ యూపీ పోలీసులు కేంద్రమంత్రి ఇంటి గోడకు నోటీసు అతికించారు. సంఘటన జరిగినపుడు తాను ఆ ప్రదేశంలో లేనని ఆశిష్ మిశ్రా చెప్పారు.ఈ కేసులో ఇద్దరు నిందితులైన లువ్కుష్, ఆశిష్ పాండేలను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption