Abn logo
Feb 26 2021 @ 23:15PM

‘మోసగాళ్ళు’ వచ్చేస్తున్నారు...

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘మోసగాళ్ళు’ చిత్రం ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. జెఫ్రీ గి చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సునీల్‌ శెట్టి కీలక పాత్రదారులు. విష్ణు మాట్లాడుతూ ‘‘2015లో ఓ సోదరుడు, సోదరి కలిసి 4వేల కోట్ల అమెరికా డబ్బును ఎలా స్కామ్‌ చేశారు. ఆ డబ్బు ఎక్కడుంది? వాళ్ళు దొరికారా? లేదా? అన్న థ్రిల్లింగ్‌ అంశంతో తెరకెక్కిన చిత్రమిది. హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా జెఫ్రీ తెరకెక్కించారు. సునీల్‌ శెట్టి పోలీస్‌గా చక్కని పాత్ర పోషించారు. ఈ చిత్రానికి వెంకటేశ్‌గారు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో త్వరలో విడుదల చేయబోతున్నాం’’ అని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement