కరోనాకు మాస్కే ఆయుధం

ABN , First Publish Date - 2021-04-20T06:13:55+05:30 IST

లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వద్దనుకుంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, కరోనాకు మాస్క్‌ను అయుధంగా భావిం చాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, వేముల వాడలో తిప్పాపూర్‌లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని పరిశీలించారు.

కరోనాకు మాస్కే ఆయుధం
వేములవాడ తిప్పాపూర్‌ ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

- సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో  మందుల కొరత లేదు

- పది రోజుల్లో వేములవాడ తిప్పాపూర్‌  ఆస్పత్రి అందుబాటులోకి 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కే తారకరామారావు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వద్దనుకుంటే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, కరోనాకు మాస్క్‌ను అయుధంగా భావిం చాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి, వేముల వాడలో తిప్పాపూర్‌లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని పరిశీలించారు. సిరిసిల్ల ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులు, అధికార యంత్రాంగంతో చర్చించినట్లు చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో రెమిడెసివర్‌, ఇతర మందుల కొరత ఉందనే అపోహలను నమ్మవద్దని, సరిపడ మందులు అందు బాటులో ఉన్నాయని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఉన్నా యన్నారు. అదనంగా కూడా మందులు తెప్పిస్తున్నా మన్నారు. సిరిసిల్ల జిల్లా  ఆస్పత్రిలో పడకలను పెంచు తున్నామన్నారు. వేములవాడ తిప్పాపూర్‌లో నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని 10 రోజుల్లో అందుబా టులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. వారం రోజుల్లోనే అందుకు సంబంధించిన బెడ్స్‌, ఇతర సౌకర్యాలు, కల్పిస్తామన్నారు. సిబ్బందిని నియమిం చే విధంగా కలెక్టర్‌ను అదేశించామన్నారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ఆస్పత్రి అందుబాటులోకి వస్తే జిల్లా ఆస్పత్రిపై కొంత భారం తగ్గుతుందన్నారు.   సిరి సిల్ల ఆస్పత్రిలో అక్సిజన్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నామని, దీంతో ఆక్సిజన్‌ కొరత లేదని, కేసులు పెరిగినా ఇబ్బంది ఉండదని అన్నారు. జిల్లాలో రోజుకు 1800 మంది వరకు కరోనా టెస్ట్‌లు చేస్తున్నారన్నారు. అదనంగా కిట్‌లు కావాలని టీఎస్‌ఎంఐడీసీ ఎండీ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డికి సూచించామని, దేశ వ్యాప్తంగా కొరత ఉన్నా మన జిల్లాకు వస్తున్నాయని తెలిపారు.  జిల్లా ఆస్పత్రిలో ఎనిమిది గంటల చొప్పున మూడు షిప్టుల్లో పనిచేయడానికి సరిపడ సిబ్బంది ఉన్నారన్నారు. జిల్లా ఆస్పత్రిలో మరో 60 మంది కరోనా బాధితుల సౌకర్యా లను అందబాటులోకి తీసుకరాబోతున్నామన్నారు. ప్రభు త్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ప్రభుత్వ ఐసోలేషన్‌ కేంద్రాలను కూడా అందుబాటులోకి తేబోతున్నామని అన్నారు. గతంలో వ్యవసాయ పాలి టెక్నిక్‌ కళాశాలను ఐసోలేషన్‌ కేంద్రంగా ఉపయోగించు కున్నామని,మళ్లీ అందుబాటులోకి తేవడంతోపాటు కొత్తగా నిర్మించిన నర్సింగ్‌ కళాశాలను కూడా  వారం రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరిగితే అందుబాటులోకి తెస్తా మని అన్నారు. తీవ్ర వ్యాధిలక్షణాలు ఉన్నవారికే ఆస్పత్రి చికిత్స అవసరం ఉంటుందని, మిగతా వారు హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స పొందవచ్చని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,280 వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. ఈ నెలలో 18 మంది మృతి చెందారన్నారు. వారు కూడా చివరి స్టేజీలో ఆస్పత్రికి రావడంతో చనిపోయారని వైద్యం అందక కాదని అన్నారు.  ప్రస్తుతం తక్కువ వయస్సు ఉన్న వారికి కరోనా వస్తోందన్నారు. చిన్న, పెద్ద వయస్సు అని కాకుండా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఫంక్షన్లు, ధావత్‌, జన సమూహాలకు దూరంగా ఉండాల న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలాఖరులోగా 45 సంవత్సరాలు పైబడిన 1.25 లక్షల మందికి మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఫ్రంట్‌ లైన్‌ వర్క ర్స్‌కు ఇప్పటికే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు.  రిపోర్టర్లు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. వ్యాధి నివా రణలో ప్రభుత్వంతో పాటు అందరూ కలిసి వస్తేనే నివా రణ సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జాతీయ సహకార బ్యాంకుల చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కౌన్సిలర్‌ గుండ్లపల్లి నీరజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, తదితరులు ఉన్నారు.

 వంద పడకల ఆస్పత్రి భవనం పరిశీలన 

వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్‌లో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి భవనాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.తారకరామారావు  సోమవారం పరిశీలించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  ఆసుపత్రిలో అవసరమైన సామగ్రి కొనుగోలు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియను వారం రోజుల్లో  పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర హెల్త్‌ విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పది రోజులలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు,   కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి రాజు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆవుల సుమన్‌మోహన్‌రావు, వైద్యాధికారి డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, జడ్పీటీసీ ఏశ వాణి, మున్సిపల్‌ కౌన్సిలర్లు జోగం శంకర్‌, యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి రామ్‌చందర్‌, సహకార సంఘం అధ్యక్షుడు ఏనుగు తిరుపతిరెడ్డి, నాయకులు గూడూరి మధు, ఏశ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-20T06:13:55+05:30 IST