మసీదులు, చర్చిలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చాలి

ABN , First Publish Date - 2021-05-08T09:25:18+05:30 IST

మసీదులు, చర్చిలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చాలి

మసీదులు, చర్చిలను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చాలి

యూఎస్‌ కాన్సులేట్‌ వెబినార్‌లో ముస్లిం మతపెద్దల పిలుపు 


కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ముస్లిం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని ముస్లిం మత సంఘాల పెద్దలు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం వెబినార్‌ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల జమాతె ఉలెమా-ఎ-హింద్‌ కార్యదర్శి ముఫ్తీ మహమూద్‌ జుబేర్‌ ఖాస్మీ మాట్లాడుతూ.. ఈసారి ముస్లింలు తమ జకాత్‌ను కొవిడ్‌ బారినపడ్డ వారికి చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మసీదులు, చర్చిలను కొవిడ్‌ సేవా కేంద్రాలుగా మార్చాలని మత పెద్దలు పిలుపునిచ్చారు.  ’

Updated Date - 2021-05-08T09:25:18+05:30 IST