Sep 26 2021 @ 23:49PM

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అక్టోబర్‌ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ‘బన్నీ’ వాసు, వాసు వర్మ వెల్లడించారు. ‘‘ఇదొక రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా నచ్చుతుంది’’ అని దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ అన్నారు. దసరాకు థియేటర్లలో కలుద్దామన్నారు హీరో అఖిల్‌. ‘‘కుటుంబంతో చూసే చక్కటి వినోదాత్మక చిత్రమిది’’ అని పూజా హెగ్డే చెప్పారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి తదితరులు ప్రధాన తారాగణంగా అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీత దర్శకుడు.