Abn logo
Jan 17 2021 @ 15:25PM

చాలా మంది రైతులు చట్టాలను ఆమోదిస్తున్నారు : తోమర్

న్యూఢిల్లీ : దేశంలోని అత్యధిక రైతులు తాము తెచ్చిన నూతన చట్టాలకు అనుగుణంగానే ఉన్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ‘‘రైతులు, నిపుణులు చాలా మంది వ్యవసాయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నారు. సుప్రీం ఉత్తర్వుల తర్వాత చట్టాలను అమలు చేయలేం. జనవరి 19 న నిబంధనల వారిగా రైతులు చర్చిస్తారని ఆశిస్తున్నాం. చట్టాల రద్దు మినమా ఏ చర్చకైనా సిద్ధమే’’ అని తోమర్ ప్రకటించారు. మండీలు, వ్యాపారాలు తదితర విషయాలకు సంబంధించి, రైతుల సంఘాల్లో నెలకొన్న భయాలను పరిష్కరించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ మేరకు రైతు సంఘాలకు ప్రతిపాదనలు కూడా పంపామని ఆయన వెల్లడించారు. పంట వ్యర్థాలను తగలబెట్టే విషయం, విద్యుత్తు తదితర అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు అన్న ఏకైక అజెండాతో ముందుకు వెళ్తున్నారని తోమర్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement