దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి

ABN , First Publish Date - 2020-08-11T10:51:36+05:30 IST

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్‌ రెవరెండ్‌ బిషప్‌ జయరావు పొలిమేర ..

దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలి

ఏలూరు టూటౌన్‌/ ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 10 : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించాలని ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్‌ రెవరెండ్‌ బిషప్‌ జయరావు పొలిమేర డిమాండ్‌ చేశారు. ఏలూరు బిషప్‌ హౌస్‌లో సోమవారం క్రైస్తవ ప్రతినిధుల సమావేశం ఐసీఎం అగ్ర పీఠాధిపతులు మోస్ట్‌రెవరెండ్‌ బిషప్‌ జాన్‌ ఎస్‌డీ రాజు ఆధ్వర్యంలో అఖిలభారత క్రైస్తవ సంఘాల పిలు పు మేరకు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు  మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు జనాభా దామాషా ప్రకారం రిజర్వే షన్లు కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిం చారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని క్యాంపు కార్యాల యంలో వినతిపత్రం సమర్పించారు. రెవరెండ్‌ ఫాదర్‌ బాల, ఫాదర్‌ ఇమ్మానియేల్‌, ఫాదర్‌ అమృత్‌, క్రైస్తవ నాయకులు  పాల్గొన్నారు. 


దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ ఆ ధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహిం చి తమ నిరసన తెలిపారు. కలెక్టర్‌ను కలిసి వినతిప త్రాన్ని అందజేశారు. రాష్ట్ర కో ఆర్డినేటర్‌ మత్తేరాజ్‌ కు మార్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ డీవీ రత్నం తదితరులు పా ల్గొన్నారు.  

Updated Date - 2020-08-11T10:51:36+05:30 IST