అద్భుతం: అడవుల్లో సందడి చేస్తున్న మొక్కలు, చెట్లు.. కొన్ని తాగునీటిని అందిస్తుండగా, మరికొన్ని వెలుగులు వెదజల్లుతున్నాయి..

ABN , First Publish Date - 2021-11-02T14:00:36+05:30 IST

ఈ భూమండలంలో ఎన్నో చిత్రవిచిత్రాలు దాగున్నాయి.

అద్భుతం: అడవుల్లో సందడి చేస్తున్న మొక్కలు, చెట్లు.. కొన్ని తాగునీటిని అందిస్తుండగా, మరికొన్ని వెలుగులు వెదజల్లుతున్నాయి..

ఈ భూమండలంలో ఎన్నో చిత్రవిచిత్రాలు దాగున్నాయి. వీటికి సంబంధించిన రహస్యాలను ఈ నాటికీ శాస్త్రవేత్తలు చేధించలేకపోతున్నారు. కొన్ని మొక్కలు, చెట్లు ఏడుస్తాయి. మరికొన్ని వేరే చోటుకి తరలిపోతాయి. ఈ భూమి మీద ఏకంగా 4 లక్షల జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. వీటిలోని కొన్ని మొక్కల గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.


నీటిని చిమ్మే మొక్కలు

భారత్‌లోని అండమాన్-నికోబార్ దీవుల్లో కెలెమస్ అండమానిక్స్ అనే మొక్కలను కనుగొన్నారు. ఈ మొక్క మొదళ్లలో నీరు ఉంటుంది. ఈ ప్రాంతవాసులు నీటికోసం ఈ మొక్క మొదళ్లను పెకిలించి తమ దాహాన్ని తీర్చుకుంటారు. ఇదేవిధంగా ఆఫ్రికాలో బావోబా అనే చెట్టు కూడా స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. 80 మీటర్ల ఎత్తువరకూ పెరిగే ఈ చెట్టు కాండం దగ్గర గాటు పెట్టి, ఈ ప్రాంతీయులు నీటిని బాటిళ్లలో పట్టుకుంటారు. 

వెలుగులు వెదజల్లే మొక్కలు

ఈ భూమిపై చీకట్లో వెలుగులు వెదజల్లే మొక్కలు ఉన్నాయిని మీకు తెలుసా? కొన్ని మొక్కలపై పడిన నీటి బిందువులు రాత్రివేళ వెలుగులు విరజిమ్ముతాయి. మష్రూం జాతికి చెందిన మొక్కలు వివిధ రంగుల్లో ఉంటూ కాంతిని ప్రసరింపజేస్తాయి. ఆక్సిజన్‌తో వివిధ రసాయనాల సమ్మేళనం కారణంగా కొన్ని మొక్కలు కాంతిని వెదజల్లుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 


ముడుచుకుపోయే మొక్కలు

సిగ్గుపడే లక్షణం మనుషులకే ఉంటుందని అనుకుంటాం. కానీ సిగ్గుపడే మొక్కలు కూడా ఉన్నాయి. ఈ మొక్కలను లాజవంతి పేరుతో పిలుస్తారు. ఈ మొక్కలను మనుషులు ముట్టుకుంటే అవి ముడుచుకుంటాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ మొక్కల ఆకులు ఒక విధమైన ద్రవ పదార్థంతో నిండివుంటాయి. అందుకే వీటికి ఏవి తగిలినా అవి ముడుచుకుపోతాయి. 

రోదించే మొక్కలు

మధ్యదరా సముద్ర తీర ప్రాంతంలో మెండ్రక్ అనే మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలను నరికినప్పుడు అవి రోదిస్తాయి. ఈ మొక్కలకు నీటి అవసరం అధికంగా ఉంటుంది. వీటిని నరికి నపుడు ఏడుపులాంటి శబ్ధం వినిపిస్తుంటుంది. 

స్థాన చలనమయ్యే చెట్లు

ఈ భూమిపై స్థాన చలనమయ్యే చెట్లు కూడా ఉన్నాయి. ఈ చెట్లను మాంగ్రేవ్ పేరుతో పిలుస్తారు. ఇవి మెల్లమెల్లగా కదులుతూ కిలోమీటరు దూరం వరకూ వెళతాయి. ఈ రకమైన చెట్లు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌గల సుందర్‌వన్ అడవులలో కనిపిస్తాయి.

Updated Date - 2021-11-02T14:00:36+05:30 IST