Advertisement
Advertisement
Abn logo
Advertisement

బజ్జీలు తింటున్నారా.. జాగ్రత్త.. bangaloreలో ఏం జరిగిందంటే..!

 కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు.. ప్రస్తుతం ప్రతి వస్తువునూ కల్తీ చేస్తున్నారు. ఇక నగరాల్లో అయితే మరీ ఘోరంగా తయారైంది. ఏది తింటే ఏమవుతుందో అనే భయంతోనే తినాల్సి వస్తుంది. బెంగళూరులో జరిగిన ఓ ఘటన చూస్తే.. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం కలుగకమానదు. వివరాల్లోకి వెళితే.. 


బెంగళూరు బెళగావి తాలూకా హుదలి గ్రామంలో పార్వతి (53).. కొడుకు సోమనింగప్ప (28)తో కలిసి నివాసం ఉంటోంది. వీరు రోజూ కూలి పనులకు వెళ్లి జీవిస్తుంటారు. రోజూ మాదిరే సోమవారం కూడా పనికి వెళ్లి వచ్చారు. రాత్రి ఇద్దరూ ఇంట్లో బజ్జీలు చేసుకుని తిన్నారు. అయితే కొన్ని గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం స్థానికులు.. ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. బజ్జీల పిండిలో పురుగులు మందు కలిసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కావాలనే ఇలా చేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement