Milk Price: మదర్ డెయిరీ పాల ధర పెంపు

ABN , First Publish Date - 2021-07-10T17:10:53+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం నుంచి పాల ధరలు పెరిగాయి....

Milk Price: మదర్ డెయిరీ పాల ధర పెంపు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఆదివారం నుంచి పాల ధరలు పెంచారు. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకుంది.పెరిగిన పాల ధరలు అన్ని రకాలకూ వర్తిస్తుందని మదర్ డెయిరీ ప్రకటించింది. గతంలో 2019 డిసెంబరులో పాల ధరలు పెంచారు. కరోనా సంక్షోభ సమయంలో పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకేజింగ్, రవాణ ఖర్చులు పెరిగాయి. దీంతో పాల ధరలు పెంచక తప్పడం లేదని మదర్ డెయిరీ ప్రకటించింది. ఏడాది కాలంగా రైతుల నుంచి పాల సేకరణ ధర పెరిగినా వినియోగదారులపై భారం మోపలేదని డెయిరీ తెలిపింది. ప్రస్థుత మాగ్జిమమ్ రిటైల్ ప్ర్రైస్ కంటే లీటరుకు రెండు రూపాయలు పెంచారు. పెంచిన పాల ధరలు సెంట్రల్ ఉత్తరప్రదేశ్, ముంబై, నాగపూర్, కోల్ కతా తదితర నగరాల్లోనూ రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. దేశంలోని వంద నగరాల్లో మదర్ డెయిరీ పాలను విక్రయిస్తోంది. 

Updated Date - 2021-07-10T17:10:53+05:30 IST