మదర్‌ డెయిరీని టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారు

ABN , First Publish Date - 2021-12-03T06:30:09+05:30 IST

రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మదర్‌ డెయిరీని టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారని కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గం ఇన్‌చార్జి, పాల సంఘం చైర్మన్‌ బీర్ల ఐలయ్య ఆరోపించారు.

మదర్‌ డెయిరీని టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారు
మదర్‌ డెయిరీ ఎదుట ఆందోళన చేస్తున్న పాడి రైతులు

కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల ఐలయ్య

12 డిమాండ్లతో మదర్‌ డెయిరీ ఎదుట ధర్నా

యాదాద్రి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మదర్‌ డెయిరీని టీఆర్‌ఎస్‌ డెయిరీగా మార్చారని కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గం ఇన్‌చార్జి, పాల సంఘం చైర్మన్‌ బీర్ల ఐలయ్య ఆరోపించారు. గురువారం భువనగిరి, ఆలేరు నియోజకవర్గానికి చెందిన సుమారు 80 మంది పాల సంఘాల చైర్మన్లు, పాడి రైతులు 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హయత్‌నగర్‌ మదర్‌ డెయిరీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ లీటర్‌కు రూ.4చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వాలన్నారు. రైతులకు 10 నెలలవరకు అందించిన ప్రోత్సాహకాన్ని గత 37 నెలలుగా ఇవ్వడంలేదన్నారు. కొంతమంది మదర్‌ డెయిరీ డైరెక్టర్లు కేంద్రాల్లో పాలు పోయకుండానే అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారని, వీరిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌చేశారు.

Updated Date - 2021-12-03T06:30:09+05:30 IST